మందకృష్ణ మాదిగపై కేసు నమోదు: నిరాహార దీక్ష కొనసాగింపు

ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధతను కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదివారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ పంపేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే, మరోవైపు వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాల మహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు, మంత్రి శంకరరావులతో మంతనాలు సాగిస్తూ ప్రభుత్వం నాటకం ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర మంత్రి శంకరరావు ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మంద కృష్ణ మండిపడ్డారు. మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు.
విషయాన్ని తెగే వరకూ లాగకూడదని భావించిన ప్రభుత్వం మందకృష్ణ దీక్షను విరమింప చేసేందుకు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపింది. అనేకసార్లు మంతనాలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి సచివాలయంలో అత్యవసరంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. సీనియర్ మంత్రులు రఘువీరారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పితాని సత్యనారాయణ, మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్, ఎంపీ మందా జగన్నాథం, డీజీపీ అరవిందరావు తదితరులు హాజరయ్యారు. కేంద్రంలో వర్గీకరణ అంశం ఏ దశలో ఉన్నదీ తెలియజేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ సీఎంకు ఒక నివేదిక ఇచ్చారు. అనంతరం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. ఎస్సీల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కూడా తీర్మానాన్ని చేసిందని, అఖిలపక్షానికి సీఎం సుముఖంగానే ఉన్నారని మంత్రులు చెప్పినప్పటికీ వారి ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అర్థరాత్రి వరకూ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మంద కృష్ణమాదిగ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను విరమింపచేసేందుకు మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎస్.శైలజానాథ్, ఎంపీ మంద జగన్నాథం తదితరులు ఆదివారం విశ్వప్రయత్నాలు చేశారు. వారంతా అనేకసార్లు మంద కృష్ణమాదిగతో సంప్రదింపులు జరిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగానే ఉన్నారని మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. ఆదివారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ వర్గీకరణ విషయంపై కేంద్రంతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వర్గీకరణపై చర్చించేందుకు ప్రభుత్వం ఆహ్వానించినా ఎమ్మార్పీఎస్ నేతలు స్పందించలేదు. లేక్‌వ్యూలో నేతల కోసం ఎదురుచూసిన శైలజానాథ్ చాలాసేపు తర్వాత ఎవరూ రాకపోవడంతో వెనుదిరిగారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications