మందకృష్ణ మాదిగపై మాల కాంగ్రెసు నేతల మండిపాటు

వర్గీకరణకు పట్టుబడుతూ మందకృష్ణ మాదిగ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తప్పు పట్టారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగదనే విషయం మందకృష్ణకు తెలిసినా ఆందోళనలు చేస్తున్నారని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేయడమే మందకృష్ణ మాదిగ పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఉనికిని కాపాడుకోవడానికే మందకృష్ణ ఈ విధమైన చర్యలకు పూనుకుంటున్నారని ఆయన విమర్శించారున.












Click it and Unblock the Notifications