ఎస్సీ వర్గీకరణ మీద సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై టిడిపి ఫైర్, అరెస్టు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను మాట్లాడకుంటా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ వారు ఎవరూ వర్గీకరణకు మద్దతు ఇవ్వకుండా చేస్తున్నాడని ఆరోపించారు. వర్గీకరణ కోసం లక్షలాదిగా తరలివచ్చిన మాదిగలపై ప్రభుత్వం పోలీసులచే లాఠీఛార్జ్ చేయించిందన్నారు. వారిపై అమానుషంగా ప్రవర్తించిందన్నారు. ముఖ్యమంత్రి వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానమంత్రితో కలిపించాలన్నారు. పార్లమెంటులో వర్గీకరణ కోసం బిల్లును ప్రవేశ పెట్టే దిశలో ప్రయత్నాలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications