సివిసి పిజె థామస్ కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

తనపై వచ్చిన ఆరోపణల మీద రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు థామస్ ను ఆదేశించింది. సివిసిగా థామస్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 27వ తేదీకి వాయిదా వేసింది. థామస్ పై క్రిమినల్ కేసు ఉండడం తమకు పట్టింపు ఉందని చీఫ్ జస్టిస్ ఎస్ హెచ్ కపాడియా, న్యాయమూర్తులు కెఎస్ రాధాకృష్ణన్, స్వతంతర్ కుమార్ లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. వ్యక్తిగతంగా తమ హాజరు కావాలని సుప్రీంకోర్టు థామస్ ను ఆదేశించింది. ఇటీవలి ప్రకారం కేంద్ర టెలికమ్ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన థామస్ సెప్టెంబర్ 7వ తేదీన సివిసిగా నియామితులయ్యారు.












Click it and Unblock the Notifications