వారణాసి బాంబు పేలుడు: ముంబై నుంచి టెర్రర్ ఇ మెయిల్

దుర్ఘటన జరిగిన సమయంలో అశ్వమేథ్ ఘాట్ వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నా తీవ్రవాదులు తీవ్రత తక్కువ ఉన్న బాంబును ఉపయోగించడం వల్ల ఎక్కువ మందికి ప్రాణాపాయం సంభవించలేదు. రద్దీగా ఉన్న ప్రాంతంలో బాంబు పేలడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా మంది స్వల్పంగానైనా గాయపడ్డారు. కాశీ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధానితో సహా ముఖ్య నగరాలన్నింటినీ భద్రతాధికారులు అప్రమత్తం చేశారు. పేలుడు ప్రాంతానికి సమీపంలోని చెత్తబుట్ట నుంచి ఇంప్రొవైస్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1992లో జరిగిన బాబ్రీ కూల్చివేతకు నిరసనగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించుకుంది. ఈ మేరకు పత్రికలకు ఈమెయిల్స్ పంపింది.












Click it and Unblock the Notifications