పీఆర్పీనుండి జగన్ పార్టీలోకి వలసలు మీడియా సృష్టి: చిరంజీవి

Chiranjeevi
ఖమ్మం: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే ఆ ప్రభావం ప్రజారాజ్యం పార్టీపై ఏమీ ఉండదని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి చిరంజీవి ఆదివారం అన్నారు. ఖమ్మం జిల్లాలో చిరంజీవి పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజారాజ్యం నుండి వలసలు ఉండవన్నారు. అదంతా మీడియా సృష్టే అని కొట్టి పడేశారు.

ఖమ్మం జిల్లా రైతాంగ సమస్యలను శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని చిరంజీవి అన్నారు. రైతులు పంట నష్టంతో తీవ్ర నిరాశ,నిస్పృహలో ఉన్నారన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. అదిలాబాద్ అర్జులగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరాలలో పాల్గొన్నారు. పుష్కరాలలో స్నానమాచరించిన తర్వాత ఆయన ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. తెలంగాణ విషయంలో ప్రజారాజ్యం శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+