వైయస్ జగన్ నిరాహార దీక్ష నిరసన మాత్రమే: సబ్బం హరి

విశాఖ జిల్లాలో ఓదార్పుయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఓదార్పుయాత్ర రూట్ మ్యాప్‌ను శనివారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ నుంచి 17 నియోజకవర్గాల్లో ఎనిమిది రోజుల పాటు యాత్ర జరుగుతుందన్నారు. చనిపోయినవారు ఏ పార్టీ వారైనా ఓదార్చటం జరుగుతుందని ఆళ్ల నాని అన్నారు.పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో మమేకం కావటం జరుగుతుందన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేక చనిపోయిన 17 కుటుంబాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. ఎంపీ సబ్బం హరి నేతృత్వంలో ఓదార్పు యాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications