కూచిపూడిపై సిలికానాంధ్ర కృషిపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసలు

కూచిపూడి నృత్యాన్ని నేర్చుకోవడానికి వేలమంది ఆసక్తి కనబరుస్తున్నారని, ఆ నాట్యం యొక్క గొప్పతనం ముందు తరాలకు అందించవలసి అవసరం మనపైన ఉందన్నారు. రెండేళ్ల క్రితం అన్నమయ్య గేయాన్ని లక్షా అరవై వేల మంది లక్ష గళార్చన చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారని గుర్తు చేశారు. సిలికానాంధ్ర చేస్తున్న కృషిని ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం నుండి 25 లక్షల రూపాయలను ఇస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో ఉంటూ అన్నమాచార్య కీర్తనలు పెట్టించటం, కూచిపూడి నృత్యాలు ఏర్పాటు చేయడం చాలా మంచి పని అన్నారు.
ఆంధ్ర కళాసంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నదని అంతకుముందు కేంద్రమంత్రి పురంధేశ్వరి మాట్లాడుతూ చెప్పారు. మన నృత్యశైలిలోని రూపాలు ఇతిహాసాలు, పురాణాలలో ఉన్నాయన్నారు. భంగిమ, ముఖ కవళికలు, ముద్ర తదితరాలు కూచిపూడిలో ఉంటాయని చెప్పారు. నాట్యశాస్త్రం, గాథసప్తశతి పుస్తకాలు మన నాట్యం గురించి వివరించాయని చెప్పారు.












Click it and Unblock the Notifications