వైయస్ జగన్ వెంట ఎమ్మెల్యేలు ఎవరూ వెళ్లరు: మంత్రి బాలరాజు
Districts
oi-Srinivas G
By Srinivas
విశాఖపట్నం: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి విశాఖలో చేపడుతున్న ఓదార్పు యాత్రలో కాంగ్రెసు పార్టీనుండి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నేతలు ఎవరూ పాల్గొనరని మంత్రి బాలరాజు అభిప్రాయపడ్డారు. జగన్‌వైపు కొందరు శాసనసభ్యులు వెళుతున్నారనే వార్తల్లో వాస్తవాలు లేవన్నారు. మేమంతా కలిసి కట్టుగానే ఉన్నామని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన ఓదార్పుకు హాజరయ్యే అవకాశాలు లేవన్నారు. కాగా పాయకరావుపేట శాసనసభ్యుడు బాబూరావు జగన్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.