రంజితతో రాసలీలలపై జర్నలిస్టులకు రూ. 10 కోట్లు ఇచ్చా: నిత్యానంద

ఆ జర్నలిస్టు ఓ అడ్వకేట్‌తో కలిసి తన వద్దకు వచ్చి సిడీ విషయాన్ని బహిర్గతం చేశాడని, తన ముందే కొన్ని క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించి, ఈ సీడీని ప్రసారం చేయకుండా ఉండేందుకు రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆయన చెప్పారు. ఆ తర్వాత తమ మధ్య జరిగిన బేరసారాల్లో పది కోట్ల రూపాయలను ఒక ముఖ్య అనుచరుడి ద్వారా అందజేశామని, తమను బ్లాక్ మెయిల్ చేసిన జర్నలిస్టు డబ్బును తీసుకుని సీడీని ప్రసారం చేసినట్టు నిత్యానంద పోలీసులకు చెప్పినట్టు వెల్లడైంది. రంజిత కూడా తనకు కూడా డబ్బు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కాల్స్ వచ్చాయని రంజిత చెప్పింది.












Click it and Unblock the Notifications