అలుగుట ఎరుగని జగన్ అలిగాడు, ప్రళయం వస్తుంది: రోజా

పలు ప్రాజెక్టులకు నీరు అందక పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మన లాయర్లు వాదనలు, మన అధికార్ల వినతులను బ్రజేష్ కమిటీ తోసి పుచ్చిందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగానే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వ్యవసాయం కోసం ఎలాంటి ప్రాజెక్టులు కట్టక పోవటం శోచనీయమన్నారు. ప్రాజెక్టుల వల్ల ఉపయోగాలు తెలుసుకున్న వైయస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే ఆయన మరణం తర్వాత ప్రాజెక్టులు మూలన పడ్డాయన్నారు. వైయస్ ఆశయాలు ముందుకు తీసుకెళతామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆశయాల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. పోలవరానికి, ప్రాణహిత - చేవెళ్ల జాతీయ హోదాకు వైయస్ అప్పుడు కోరినప్పటికి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు.
ఎక్కువ ఎంపీలను అందించి సహాయం చేసిన రాష్ట్రానికి సహాయ మంత్రులు, వేరే రాష్ట్రాల ఎంపీలకు మంత్రి పదవులా అని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజల నోట్లో మట్టి కొట్టడానికే కర్ణాటక ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచిందన్నారు. నాడు దేవేగౌడ చేపట్టిన ఆలమట్టి డ్యాం వల్ల మనం ఇప్పుడు కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. తీర్పు వల్ల అన్నపూర్ణగా ఉండాల్సిన రాష్ట్రం అన్నమో రామచంద్రా అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరూ జగన్ కు మద్దతుగా ఉంటే మన సమస్యలు తీర్చుకోవచ్చన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్నెర్ర చేస్తే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మట్టి కరుస్తాయన్నారు.












Click it and Unblock the Notifications