జగన్ దీక్ష: ధిక్కరించిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాంగ్రెసు నోటీసులు?

Veerappa Moily
న్యూఢిల్లీ: తమను ధిక్కరిస్తూ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ దీక్షలో పాల్గొన్న తమ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోగలదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వైయస్ జగన్ దీక్షకు కాంగ్రెసువారు వెళ్లడం పార్టీని ధిక్కరించడమేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సోమవారం చెప్పారు. తాజాగా ధిక్కారానికి నోటీసులు ఇస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ మంగళవారం చెప్పారు. పార్టీ నేతల హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా పార్టీ నాయకులు మాత్రమే కాకుండా శానససభ్యులు, పార్లమెంటు సభ్యులు జగన్ దీక్షలో పాల్గొన్నారు.

పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి దీక్షలో వైయస్ జగన్ పక్కనే కూర్చున్నారు. దాదాపు 21 మంది శాసనసభ్యులు వైయస్ జగన్ దీక్షకు హాజరయ్యారు. మాజీ మంత్రులు, నాయకులు చాలా మందే ఉన్నారు. వీరందరిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటుందా, అంత ధైర్యం చేస్తుందా అనేది అనుమానంగానే ఉంది. శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుందనేది అర్థమవుతోంది. ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఆయన వెంట ఉన్నారు. బయటకు కనిపిస్తున్నవారు అంతే మంది. అయితే, జగన్‌కు మద్దతు తెలుపుతున్నవారు బయటకు కనిపించకుండా ఎంత మంది ఉన్నారనేది అంచనాకు అందడం లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటే వారంతా బలపరిచే అవకాశం లేకపోలేదు. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షంగా జగన్‌కు సహకరించే అవకాశాలు లేకపోలేదు. దీనివల్ల జగన్ వెంట వెళ్లిన తమ పార్టీ శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడం కాంగ్రెసు అధిష్టానానికి అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+