జగన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వీరప్ప మొయిలీ

జగన్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలపై ఏం చర్యలు ఎప్పుడు తీసుకోవాలో మాకు తెలుసునని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని అన్నారు. 125 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూశామని ఆయన చెప్పారు. జగన్ మా పార్టీ సభ్యుడు కాదని అన్నారు. తెలంగాణ ఎంపీలకు గతంలో ఇచ్చిన హామీ మేరకే ఆహ్వానం పంపించామని చెప్పారు.
కాగా అంతకుముందు హైదరాబాదు ఎయిర్ పోర్టులో దిగినప్పుడు ఢిల్లీలో మాజీ పార్లమెంటు సభ్యుడువైయస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షలో 25 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారనే విషయం తనకూ తెలుసునని మొయిలీ చెప్పారు. జగన్ వెంట ఉన్న విషయం అధిష్టానానికి తెలుసునని చెప్పారు. వారి విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications