తెలంగాణలో వైయస్ జగన్‌కు శాసనసభ్యుల బలమెంత?

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్‌కు కూడా తెలంగాణలో చాలా బలం ఉందని ఆయన వర్గానికి చెందిన నాయకులు చెబుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు జగన్‌కు పెద్దగా తెలంగాణ నుంచి శాసనసభ్యుల మద్దతు లభించడం లేదు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, సికింద్రాబాబ్ శాసనసభ్యురాలు జయసుధ, ఖమ్మం జిల్లాకు చెందిన శాసనసభ్యురాలు కుంజా సత్యవతి మాత్రమే వైయస్ జగన్ వెంట కనిపిస్తున్నారు. వీరిలో జయసుధను తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేగా చెప్పడానికి లేదు. ఆమెకు పెద్దగా రాజకీయాలు తెలియవు. వైయస్సార్ టికెట్ ఇవ్వడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ బలంగా లేని సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. కాగా, గోనె ప్రకాశ రావు, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ కొండా మురళి మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే, ప్రజల మద్దతు ఉన్న తెలంగాణ నాయకులు వైయస్ జగన్ వెంట నామమాత్రంగానే ఉన్నారని చెప్పవచ్చు.

కాగా, సుధీర్ రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి వంటి శాసనసభ్యులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి యువ మంత్రులు వైయస్సార్ అభిమానులే. ఇలా ఇంకా కొంత మంది వైయస్సార్ అభిమానులు ఉన్నారు. అయితే, వారు నేరుగా వైయస్ జగన్‌కు మద్దతు తెలపడానికి వెనకాడుతున్నారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ తొలుత వైయస్ జగన్‌కు మద్దతుగా మాట్లాడినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. తెలంగాణ అంశం వైయస్ జగన్‌కు తెలంగాణలో పెద్ద ఆటంకంగా మారింది. తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వైయస్ జగన్ వెంట వెళ్తే తెలంగాణ ప్రజలు సహించే స్థితిలో లేరు. అంతగా తెలంగాణ ఉద్యమం పాతుకుపోయి ఉంది. దీంతో చాలా మంది శాసనసభ్యులు నేరుగా జగన్‌కు మద్దతు తెలపడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. లోలోపల మాత్రం వైయస్ జగన్ మద్దతుదారులు ఉన్నారని అంటున్నారు. అవసరం వస్తే వారు వైయస్ జగన్‌కు మద్దతు తెలవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది. అయితే, తెలంగాణలో నాయకులకు కాకుండా సంప్రదాయబద్దంగా కాంగ్రెసుకు, ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండే నాయకులే ఎక్కువ. దీంతో వైయస్ జగన్ తెలంగాణలో పాగా వేయడం కష్టమే.

తెలంగాణ ప్రజల మద్దతు సంపాదించడానికి వైయస్ జగన్ కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు. తెలంగాణపై ఆయన వర్గం దాగుడు మూతుల ఆడుతోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిందే కేంద్ర ప్రభుత్వమేనని, అందులో వైయస్ జగన్ చేయాల్సింది ఏమీ ఉండదని తాజాగా పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. జగన్ తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ఇస్తానంటే అడ్డుకునే స్థితిలో కూడా లేరని అంటున్నారు. దీంతో కూడా వైయస్ జగన్‌కు తెలంగాణ నుంచి మద్దతు లభించే అవకాశం ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+