Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై విరుచుకు పడిన వైయస్ జగన్

YS Jagan
న్యుఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి న్యూఢిల్లీలోని తన జలదీక్షలో ప్రధానమంత్రి మన్మోహన్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర రైతుల కష్టాలు చెప్పడానికి తాను వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. కృష్ణా ట్రిబ్యునల్ అన్నాయంపై కూడా చెప్పుకుందామని లేఖ రాస్తే ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని అందుకే రాష్ట్రం సమస్యలు ప్రధాని, అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడానికే తాను దీక్షను చేపట్టానని చెప్పారు. తుఫాను కారణంగా సుమారు 434 మంది చనిపోయారని అయితే ముఖ్యమంత్రి సహాయం ప్రకటించిన తర్వాతే అందులో 300కు పైగా చనిపోయారని ఆరోపించారు. అలాంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసి వదిలి పెట్టిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయన్నారు. వ్యవసాయమే దండుగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసమంటూ రైతులను నమ్మించ చూస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయానికి పెట్టిన ఖర్చును సంవత్సరం వారిగా చెప్పారు. 2002 వరకు బచావత్ ట్రిబ్యునల్ ముగుస్తుంది కాబట్టి కొత్త ప్రాజెక్టులు కట్టమని వైఎస్ చెప్పినప్పటికీ చంద్రబాబు వినిపించుకోలేదన్నారు. అయితే 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ ప్రాజెక్టుల ఆవశ్యకత దృష్ట్యా వాటిని ప్రారంభించారన్నారు. రైతుల కోసం చంద్రబాబు తొమ్మిదేళ్లలో 10వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ ఐదేళ్లలో 40వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అలాంటి వ్యక్తి వైఎస్ గురించి మాట్లాడం విడ్డూరమన్నారు.

మిగులు జలాలు అవసరం లేదని వైఎస్ చెప్పడానికి చంద్రబాబు ప్రాజెక్టులు కట్టక పోవడమే కారణమన్నారు. రైతుల గురించి, విశ్వసనీయత గురించి, విలువల గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే వైఎస్ గుర్తుకు వస్తారన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడానికి వైఎస్ తన మొదటి సంతకం ఉచిత కరెంటు ఫైలు పైనే సంతకం చేశారన్నారు. గత సంవత్సర కాలంగా వరదలతో రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల గురించి వివరించడానికి తాను డిల్లీకి వస్తే ప్రధాని మన్మోహన్‌సింగ్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. కృష్ణా ట్రిబ్యునల్ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని వివరించడానికి కూడా ప్రధానికి లెటర్ రాస్తే ఆయననుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని, ఇదీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రైతులపై ఉన్న ప్రేమ అన్నారు.

ఇక్కడకు వచ్చింది ఎవరినో తిట్టడానికి కాదని మా రైతుల సమస్యలు చెప్పడానికన్నారు. బ్రజేష్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ తీసుకున్న తరహాలో 75 శాతం కాకుండా 65 శాతం ఆధార జలాలు తీసుకొని రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయన్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌పై బోర్డు పెడితే లాభం ఏమీ ఉండదన్నారు. తుంగభద్ర బోర్డు పెట్టినప్పటినుండి రాష్ట్రానికి అన్యాయమే జరిగిందన్నారు.

కృష్ణా, గోదావరి నదులను కలిపితేనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ప్రధానికి సూచించారు. దీనిపై జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల ఆవశ్యకత ఉందన్నారు. కొందరు ఎంపీలు పోలవరాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+