ఉద్రిక్తత మధ్య దీక్ష, అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానన్న జగన్

తనను అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. ఈ స్థితిలో పోలీసులు దీక్ష శిబిరాన్ని చుట్టుముట్టారు. ఖాళీ చేయాలని పోలీసులు అందరినీ ఆదేశించారు. కానీ అందుకు వారు నిరాకరించారు. పోలీసులను అడ్డుకోవడానికి వైయస్ జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొలుత 7 గంటల వరకు దీక్షకు సమయం ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత 8 గంటల వరకు పెంచినట్లు తెలుస్తోంది.
తాను బుధవారం ఉదయం 6 గంటల వరకు 30 మందితో దీక్ష చేస్తానని, మిగతావారు వెళ్లిపోతారని వైయస్ జగన్ పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వినలేదు. కార్యకర్తలను సముదాయించడానికి ఎమ్మెల్సీ ప్రభాకర రావు ప్రయత్నించారు. వైయస్ జగన్ ప్రధాని డాక్టర్ అపాయింట్‌మెంటు కోరారు. సాయంత్రం ఏడు గంటలలోగా దీక్షా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని పోలీసులు తొలుత ఆదేశించారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఆవేశాన్ని ఫణంగా పెట్టవద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జగన్ తన కార్యకర్తలకు సూచించారు.
సోనియా డౌన్ డౌన్ అంటూ వైయస్ జగన్ మద్దతుదారులు నినాదాలు చేశారు. దీక్షను విరమించాలని వైయస్ జగన్ కోరారు. అయితే, తమకు న్యాయం కావాలంటూ వారు డిమాండ్ చేశారు. షుగర్ పేషంట్లు ఎవరైనా ఉంటే దీక్ష విరమించాలని జగన్ సూచించారు. అయితే, రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. రాత్రి పొద్దుపోయిన తర్వాత కార్యకర్తలు వెళ్లిపోతే నచ్చజెప్పి వైయస్ జగన్‌ను అరెస్టు చేయాలని పోలీసులు అనుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications