వైయస్ జగన్ అరెస్టుకు యత్నాలు, జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

తనను అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. ఈ స్థితిలో పోలీసులు దీక్ష శిబిరాన్ని చుట్టుముట్టారు. ఖాళీ చేయాలని పోలీసులు అందరినీ ఆదేశించారు. కానీ అందుకు వారు నిరాకరించారు. పోలీసులను అడ్డుకోవడానికి వైయస్ జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తాను బుధవారం ఉదయం 6 గంటల వరకు 30 మందితో దీక్ష చేస్తానని, మిగతావారు వెళ్లిపోతారని వైయస్ జగన్ పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వినలేదు. కార్యకర్తలను సముదాయించడానికి ఎమ్మెల్సీ ప్రభాకర రావు ప్రయత్నించారు. తీవ్ర ఉద్విగ్నభరిత వాతావరణంలో జగన్ వర్గం నాయకులు కార్యకర్తలను చల్లబరిచేందుకు ప్రయత్నించారు. మరో గంటలో దీక్షా ప్రదేశాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications