ఢిల్లీలో వైయస్ జగన్ దీక్ష ప్రారంభం: ఎమ్మెల్యే జయసుధ హాజరు

YS Jagan
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరోజు జలదీక్ష న్యూఢిల్లీ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రానికి పూలమాల వేసి జగన్ తన దీక్షను ప్రారంభించారు. అయితే దీక్ష 24 గంటలు చేపడతామని ముందుగా ప్రకటించినప్పటికీ ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినందున సాయంత్రం వరకే దీక్ష కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే 24 గంటల దీక్షకు తమ ప్రయత్నాలు చేస్తామని జగన్ వర్గం నేతలు చెబుతున్నారు.

జగన్ దీక్షలో పాల్గొన్న కాంగ్రెసు ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాంగ్రెసు శాసనసభ్యులు జోగి రమేష్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆమర్నాథ్‌రెడ్డి, బాలరాజు, కొండ సురేఖ, శేషారెడ్డి, జయసుధ, గురునాథ్‌రెడ్డి, రేగా కాంతారావు, కె శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోసు, కుంజా సత్యవతి, బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, ఆళ్లనాని, ప్రసాద్‌రాజు, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, నీరజారెడ్డి, పార్థసారధి, ప్రసాద్‌రాజు కాంగ్రెసు నుండి ఉండగా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ‌రెడ్డి, బాలనాగిరెడ్డిలు ప్రజారాజ్యం నుండి శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలు ఉన్నారు.

శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, కొండా మురళిలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రవిబాబు, జలీల్‌ ఖాన్, రఘురామిరెడ్డి, భూమా నాగిరెడ్డి, పెన్మత్స సాంబశివరాజు తదితరులు ఉన్నారు. అంబటి రాంబాబు, వైవి ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా పైన పేర్కొన్న వారిలో చాలామంది ఇప్పటికే దీక్షలో పాల్గొనగా మరికొందరు హాజరు కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+