అనుకున్నది నెరవేరిందంటూ రాత్రి అరెస్టయిన వైయస్ జగన్

కాదు కూడదని దీక్ష కొనసాగిస్తే తనను పోలీసులు అరెస్టు చేస్తారనీ, ప్రతిఘటిస్తే తన వెంట వచ్చినవారికి గాయాలు అవుతాయన్నారు. అది తనకు ఇష్టం లేదని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశంలో ప్రతి ఒక్కరి దృష్టికి తెచ్చినట్లు భావిస్తున్నాననీ, తద్వారా జలదీక్ష సక్సెస్ అయిందని అనుకుంటున్నానని ఆయన అన్నారు. అనుకున్న పని నెరవేరింది కనుక అరెస్టయ్యేందుకు తను పోలీసులకు సహకరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే తనను అరెస్టు చేస్తున్నందుకు ఎవరూ ప్రతిఘటించవద్దని సూచించారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదనీ, ఆ తప్పును కూడా ప్రముఖ జాతీయ ఛానళ్లు ఎత్తి చూపాయని చెప్పారు. జలదీక్షతో కేంద్రం చొరవ తీసుకుని కృష్ణా జలాల పంపిణీపై తగు నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ ఆందోళన తప్పదని జగన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications