బోర్డు తిప్పేసిన కామధేను లిఫిన్ ఇండియా ప్రైవేట్ కంపెనీ
Districts
oi-Srinivas G
By Srinivas
వరంగల్: వరంగల్ జిల్లాలో ఓ ప్రైవేట్ కంపెనీ తన డిపాజిటర్లకు కోట్లాది రూపాయల మొత్తాన్ని కుచ్చుటోపీ పెట్టింది. నగరంలోని కామధేను లిఫిన్ ఇండియా ప్రైవేట్ కంపెనీ సుమారు 20 కోట్ల రూపాయల మేరకు తన డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టింది. పదిహేను వేలమంది వరకు కామధేను బాధితులు ఉన్నారు. ఫైనాన్సు పేరుతో వేలమంది డిపాజిటర్లనుండి ఇరవై కోట్ల రూపాయలను సేకరించి ఇప్పుడు బోర్డు తిప్పేసింది. దీంతో కామధేను బాధితులు లబోదిబో అంటున్నారు. పోలీసులను ఆశ్రయించారు.
కాగా కామధేను లిఫిన్ ఇండియా కంపెనీ యాజమాన్యం తమ డిపాజిటర్లకు తెలియకుండా ఆస్తులు విక్రయించింది. అయితే వీరి అక్రమాలకు స్థానిక రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కూడా సహకరించినట్లుగా తెలుస్తోంది.