తెలంగాణ కోసం స్వీయ నిర్బంధంతో లాయర్ల ఆమరణదీక్ష

కాగా తెలంగాణ ఉద్యమంలో ఈ లాయర్లు మొదటినుండి ఉద్యమిస్తున్నారు. తమకు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుతో సంబంధం లేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలనే ఏకైక డిమాండ్‌ను వారు ప్రభుత్వం ముందుంచారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇప్పటికే ఏడాది పాటు ఆలస్యం చేసిందని వారు ఆరోపించారు. కమిటీ ఇచ్చిన ఆరు పరిష్కారాల్లో ఏ ఒక్కదానిలో కూడా స్పష్టత లేదన్నారు. తెలంగాణ కోసం ప్రజలంతా ఉద్యమించాలని వారు అన్నారు. వారికి మద్దతుగా కోర్టుకు భారీగా తెలంగాణవాదులు తరలారు. రచ్చబండను తెలంగాణనుండి మరల్చడానికే అన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి తెలంగాణపై హామీ ఇవ్వాలని భార్గవ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications