జై బోలో తెలంగాణలో కెసిఆర్ పాట గారడీ చేస్తుండ్రు పాట కట్

కాగా, సినిమాపై సమైక్య జెఎసి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వలసవాదులు అనే మాటపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పే విధంగా సినిమా ఉందని జెఎసి నాయకులు విమర్శించారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే సుభిక్షంగా ఉంటాయని అంబేడ్కర్ ఎప్పుడూ చెప్పలేదని, అంబేడ్కర్ చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించారు గానీ అలా చెప్పలేదని వారంటున్నారు. ఈ రెండు సన్నివేశాలను తొలగిస్తే సినిమా పట్ల తమకు అభ్యంతరం లేదని వారంటున్నారు.
కాగా, రెండు సన్నివేశాల పట్ల, గారడీ చేస్తుండ్రు పాట పట్ల తప్ప మొత్తంగా సినిమా బాగుందని సీమాంధ్రలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా బాగుందని అంటున్నారు. కర్నూలులో జై బోలో తెలంగాణ సినిమాను అడ్డుకున్నారు. సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రి శివజ్యోతి థియేటర్‌లో సినిమా ప్రదర్శనను కొద్దిసేపు విద్యార్థులు అడ్డుకున్నారు. సినిమా పోస్టర్లను చించేశారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.