అవినీతి నిర్మూలించలేని మన్మోహన్ ప్రధానిగా క్షేమం కాదు: టిడిపి

మళ్లీ అంతలోనే దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రభుత్వం అవినీతిపై ఎవరూ ప్రశ్నించకూడదా అన్నారు. ప్రభుత్వం అవినీతిపై నోరు నొక్కేందుకే ఇలాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. ఇలాంటి కక్ష పూరిత చర్యలకు తెలుగుదేశం పార్టీ బయపడదన్నారు. ఎవరీ తాటాకు చప్పుళ్లకు బయపడేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే కుట్రలో భాగమని ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలపై రెండు నెలలకోసారి ఐటి దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు.
అవినీతిని ఎదుర్కొనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవిలో ఉండటం దేశానికి క్షేమకరం కాదని మరో సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ప్రధాని వెంటనే దిగిపోవాలని చెప్పారు. మహాత్మా గాంధీ హాస్పిటల్‌లో గత కొద్దిరోజులుగా ఆమరణ దిక్ష చేస్తున్న బిఇడి విద్యార్థులు తమ దీక్షను విరమించాలని మరో నేత కడియం శ్రీహరి కోరారు.












Click it and Unblock the Notifications