ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంచెలు ఊడదీస్తానన్న వారిని పంచెన చేర్చుకున్నారు: రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
ఏలూరు: ప్రజల వెనుక ఉండి, ముందుండి నడిపించే వాడు నాయకుడు అయినప్పటికీ జగన్ మాత్రం ప్రజలతో పాటు నడుస్తున్నారని, ఇలాంటి వారే అసలైన ప్రజా నాయకుడన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ పాదయాత్ర కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండబెట్టిందన్నారు. అలాంటి పాదయాత్రను ఇప్పుడు జగన్ ప్రజల కోసం చేపట్టారన్నారు. జగన్‌ను ఎందరో అణగదొక్కాలని చూస్తున్నారని అయితే ఆయన బలం ముందు ఎవరూ నిలవలేక పోతున్నారన్నారు. ఆ బలం వచ్చింది అభిమానులనుండే అని అన్నారు. ప్రాజెక్టులపైన వైయస్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. పోలవరం సాధన కోసం జగన్ హరిత యాత్ర చేపడితే విమర్శిస్తున్నారన్నారు. అలమట్టీ డ్యాం నిర్మాణాన్ని ఆపని దద్దమ్మలు జగన్‌ను విమర్శిస్తున్నారన్నారు.

ముంపు బాధితులకు పరిహారం విషయంలో మాట్లాడని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధికోసం ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. చిరంజీవికి జాతీయ హోదా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పంచెలూడదీస్తామన్న వారిని పంచన చేర్చుకున్నారన్నారు. వైయస్ వారసులమంటూనే జగన్‌పైన విమర్శలు చేస్తున్నారన్నారు. పోలవరం లక్షల ఎకరాలు సాగుకు ఉపయోగపడుతుందన్నారు. పోలవరం వల్ల తెలంగాణకు ప్రయోజనం లేదనే మాటల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం హయాంలో రైళ్ల విషయంలో, నీళ్ల విషయంలోనే కాకుండా మర్యాద విషయంలోనూ చిన్న చూపు చూస్తుందన్నారు. పోలవరం వైయస్ కల అని దానికి జాతీయ హోదా కల్పించి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

కాగా అంతకుముందు మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోసు మాట్లాడుతూ సర్ ఆర్ధర్ కాటన్‌ బ్రిడ్జిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా తమకు అభ్యంతరం లేదన్నారు. దిగువ ప్రాంత రైతులకు పోలవరం రెండోదశ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రభుత్వం నీటిని వినియోగించుకోలేక పోయిందన్నారు. పోలవరం ప్రధాన ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరానికి వెంటనే జాతీయ హోదా కల్పించాలన్నారు. పూర్తిస్థాయిలో గోదావరి నీటిని మనం సద్వినియోగం చేసుకోలేక పోయామని అన్నారు.

English summary
Cine artist and political leader Roja accused Chiranjeevi and Congress High Command in Polavaram meeting. She questioned Sonia Gandhi about merger of Chiranjeevi's Prajarajyam. She said that the Polavaram was late YSR's dream. She demanded National Status for Polavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X