హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తుల కేసులో పత్రికా ప్రకటనల ద్వారా హైకోర్టు నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ ఆస్తుల కేసులో హైకోర్టు సోమవారం తాజాగా నోటీసులు జారీ చేసింది. జగన్‌ అక్రమ సంపాదనకు సంబంధించి మంత్రి శంకరరావు రాసిన లేఖను పిటిషన్‌గా స్వీకరించి విచారణ చేపట్టిన ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు అందలేదు. ఈ కేసులో 52 మంది దాకా ప్రతివాదులుండగా కొంతమంది తరపున న్యాయవాదులు నోటీసులు అందుకున్నారు. మిగిలినవారు బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఉన్నారని చెప్పడంతో పత్రిక ద్వారా నోటీసులు ఇస్తూ ప్రకటన జారీ చేయాలని జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, జస్టిస్‌ వి.సూరిఅప్పారావులతో కూడిన ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.

జగన్ ఆస్తుల కేసులో కౌంటర్లు దాఖలు చేయాలన్న దానిపై జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌ తదితర కంపెనీల తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అల్తాఫ్‌ అహ్మద్‌, హైకోర్టు మాజీ పీపీ సి.నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో ఆరోపణలకు సమాధానం వెల్లడించబోమనీ, చట్టపరమైన అంశాలకే సమాధానమిస్తామన్నారు. క్రిమినల్‌ కేసులు పెట్టడానికి ఇతరత్రా విధానాలున్నాయన్నారు. తదుపరి విచారణ మార్చి 14కు వాయిదా పడింది.

English summary
Andhra Pradesh High Court on monday issued fresh notices in Ex MP YS Jagan's properties case. The notices issued earlier were not received by some people. So, High Court decided to issue notice through news paper statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X