తెలంగాణ సహాయ నిరాకరణ షురూ, వేడెక్కిన వాతావరణం

రాష్ట్ర రాజధాని సహా మొత్తం తెలంగాణ జిల్లాలన్నింటిలోని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు.. ఇలా ఏ ఒక్కచోటా పనిచేసేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులపై చర్యలు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని, మాట తప్పితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని టీఎన్జీవో నేతలు హెచ్చరించారు. ఉద్యమంపై ప్రభుత్వ స్పందనను బట్టే తమ విధానం కూడా ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో బుధవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, విఠల్, దేవీప్రసాద్, మధుసూదన్‌రెడ్డి కలిశారు. తమ ఉద్యమానికి సహకరించాలని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టించాలని డీఎస్‌ను కోరారు.
పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకం ఉద్యమం చేస్తుంటే.. వారు చెల్లించే పన్నుల నుంచి జీతాలు తీసుకునే తాము మౌనంగా ప్రేక్షకపాత్రలో ఉండలేమని స్వామిగౌడ్ చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగానే నిరసన తెలియజేస్తామని, వ్యవస్థను కుప్పకూల్చబోమన్నారు. తమ ఉద్యమానికి సహకరించాలని సీమాంధ్ర ఉద్యోగులను కోరారు. తమ సీట్లలో కూర్చుని పని చేయవద్దని, తమ మనోభావాలను, ప్రయత్నాలను దెబ్బతీయవద్దని స్వామిగౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామిక విలువలు చెడిపోకుండా, వ్యవస్థలు పాడుకాకుండా, పేదలకు నష్టం కలగకుండా తమ నిరసన తెలియజేయాలని డీఎస్ సూచించినట్టు ఆయన చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేయాలని, మంత్రులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని విఠల్ కోరారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నేతలు కోరినన్ని రోజులు సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తామని స్వామిగౌడ్ ప్రకటించారు. సహాయ నిరాకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా ఉద్యోగులకు సహకరించాలన్నారు.












Click it and Unblock the Notifications