Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావోయిస్టుల బందీగానే వినీల్ కృష్ణ, మధ్యవర్తి హరగోపాల్ ఆగ్రహం

Vineel Krishna
భువనేశ్వర్: ఒరిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి కలెక్టర్ వినీల్ కృష్ణ ఇంకా మావోయిస్టుల బందీగానే ఉన్నారు. ముందు ప్రచారం జరిగినట్టు మావోయిస్ట్ట్టులు వినీల్ కృష్ణను విడుదల చేయలేదు. కేవలం జూనియర్ ఇంజనీర్‌ను మాత్రమే విడుదల చేశారు. కలెక్టర్ కృష్ణను విడుదల చేయడానికి జైల్లో ఉన్న ఐదుగురు కీలక నేతలనూ విడుదల చేయాల్సిందేనని మావోయిస్టులు తాజాగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై మధ్యవర్తిగా వెళ్లిన హరగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినీల్ కృష్ణ విడుదలకు మావోయిస్టులు కొత్త డిమాండ్లు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. వినీల్ కృష్ణను వెంటనే విడుదల చేయాలని ఆయన మావోయిస్టులను కోరారు.

తాము విడుదల చేసిన జేఈ మాఝీ ద్వారా ఒక లేఖలో మావోయిస్టులు మల్కన్‌గిరి జిల్లా యంత్రాంగానికి పంపారు. ఈ లేఖలో వారు కొత్త డిమాండ్లు పెట్టారు. మల్కన్‌గిరి కోర్టులో శ్రీరాముల శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదాపడింది. మరో మావోయిస్ట్ట్టు నేత గంటి ప్రసాదానికి బెయిల్ మంజూరైనా మిగతావారు విడుదలయ్యేవరకు జైల్లోనే ఉంటానని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. కలెక్టర్ విడుదల కాకపోవడంతో ఏవోబీలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇద్దరు బందీలను విడుదల చేస్తున్నట్టు అపోహ పడిన అధికారులు అదే అంశాన్ని బయటకు వెల్లడించడంతో మీడియాలో కలెక్టర్, జేఈ విడుదలైనట్టు ప్రచారం జరిగింది. బుధవారం మధ్యాహ్నం చిత్రకొండ చేరుకున్న జేఈ మాఝీతో మావోయిస్టులు ఒక లేఖను జిల్లా అధికారులకు పంపారు.

కిడ్నాప్ చేసిన బోడపాడ సమీపంలోని జనతాబాయ్ ప్రాంతానికి ముగ్గురు మావోయిస్టులు జేఈని వెంటబెట్టుకొని వచ్చి అక్కడ ప్రజలకు అప్పగించారు. ఈ సమాచారాన్ని ముందే తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి కోరుకొండ వీడీవో మహంతికుమార్, ఏపీవో మానసమిత్రతోపాటు మరో ఇద్దరు సర్పంచ్‌లను పంపారు. ద్విచక్ర వాహనాలపై జేఈని జాన్‌బాయ్ వరకు తెచ్చి అక్కడనుంచి లాంచీపై చిత్రకొండకు 23 కిలోమీటర్ల దూరంలో గల జాన్‌బాయ్ ఘాట్ వరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తీసుకొచ్చారు.

అక్కడ నుంచి మళ్లీ ద్విచక్ర వాహనంపై ఎస్ఆర్ పైప్‌లైన్ జంక్షన్ వరకు తీసుకొచ్చి అక్కడనుంచి జీపులో చిత్రకొండ అతిథిగృహానికి చేర్చారు. డీఆర్‌డీఏ పీడీ బల్వంత్‌సింగ్ పర్యవేక్షణలో వైద్యులు జేఈకి వైద్య పరీక్షలు జరిపి సుమారు గంటసేపు చర్చించి.. మల్కన్‌గిరి తరలించారు. జనతాబాయ్ నుంచి ద్విచక్ర వాహనంపై జేఈని తెచ్చేటప్పుడు ఆయనను ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్ పెట్టి మరో ఇద్దరు ఎస్కార్ట్‌గా ఉన్నారు. మావోయిస్టుల ఆధీనంలో కలెక్టర్ సురక్షితంగానే, తనను కలెక్టర్‌ను ఏమాత్రం వేధించలేదని జేఈ మాఝీ మల్కన్‌గిరిలో చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+