వారి పని వారు చేశారు: మావోయిస్టులపై కలెక్టర్ వినీల్ కృష్ణ

కాగా తాను విడుదల అయిన తర్వాత తన గురించి ఇటు ఒరిస్సా రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విషయం తెలుసుకొని చాలా ఉద్వేగానికి లోనయ్యానని చెప్పారు. తన విడుదలకు మద్దతు ప్రకటించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన విడుదల కోసం గిరిజనులు ఇంత అభిమానం చూపించడం వారికి మరింత సేవ చేయాలనే కోరిక కలిగిందన్నారు. ఇప్పటి వరకు వారికి నేను చేసింది చాలా తక్కువ అని ఇకనుండి మరింత సేవ చేస్తానని చెప్పారు. అందరూ నాపై ప్రేమాభిమానాలు చూపించారన్నారు.












Click it and Unblock the Notifications