కాంగ్రెసు దారిలో టి-టిడిపి: అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ

కేంద్ర మంత్రి చిదంబరం రాత్రికి రాత్రే తెలంగాణ రాదు అనే వ్యాక్యలను వారు ఖండించారు. రాత్రికి రాత్రే తెలంగాణ రాదంటే ఇక కాంగ్రెసు పార్టీకి చీకటి రాత్రులే అని హెచ్చరించారు. చిదంబరం ప్రకటన చూస్తుంటే తెలంగాణను జాప్యం చేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మనసులోని మాట చిదంబరం నోటనుండి వచ్చినట్టు ఉందన్నారు. ఇక నుండి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తామని వారు చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డిక్లరేషన్ కోరుతారా అని ప్రశ్నించారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications