ఎవరి ఓట్లైనా అడుగుతాం, బాబుతో శతృత్వం లేదు: సిఎం కిరణ్

ఉద్యమాల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ వల్ల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, సంఘాలు పరీక్షలకు సహకరించాలని కోరారు. ఆరు నెలల్లో అన్ని సమస్యలు సమసి పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ జెఏసి తలపెట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా మార్చ్ 10న జరగనున్న ఇంటర్ పరీక్షపై శనివారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాజీతంపై లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ మాట్లాడటం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications