పేరు మారినా నేను మారను: పీర్పీ సమావేశంలో చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీకి కాంగ్రెసు పార్టీ అవసరం ఎంతగా ఉందో, కాంగ్రెసుకు పీఆర్పీ అవసరం అంతే ఉందన్నారు. పీఆర్పీని నిర్మాణాత్మక దిశలో నడిపానని చెప్పారు. అందరూ తనకు బాగా సహకరించారన్నారు. పీఆర్పీని చిరంజీవి పార్టీ అన్న విధంగా ఉందన్నారు. అయితే తాను ప్రవచించిన సమాజిక న్యాయం కోసం కాంగ్రెసు పార్టీలో విలీనం అయిన తర్వాత కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. నేను, నా భావాలు, విధానాలు, ఆలోచనలు ఇందులో మార్పు రాలదేన్నారు. కేవలం పేరు మాత్రమే మారిందన్నారు. హోదాకోసం నేను విలీనం చేయడం లేదన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే మరికొంత బలం అవసరమనే ఉద్దేశ్యంతోనే విలీనం ప్రక్రియను ప్రారంభించామన్నారు.












Click it and Unblock the Notifications