చంద్రబాబు తక్కువ తినలేదా, భూ కేటాయింపుల దారి అదే?

సాక్షి దినపత్రిక చంద్రబాబు జరిపిన భూ కేటాయింపులను కూడా క్రోడీకరించిది. సాక్షి దినపత్రిక ప్రకారం చంద్రబాబు జరిగిన భూ కేటాయింపులు - రహేజాకు 2,110 కోట్ల రూపాయల విలువ చేసే 109 ఎకరాలు, వైజాగ్ ఫార్మాసిటీకి 10,372 కోట్ల రూపాయల విలువ చేసే 2,143 ఎకరాలు, అగాఖాన్ ఫౌండేషన్‌కు1,936 కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాలు, ఇలా చంద్రబాబు రూ. 1,60,420 విలువ చేసే మొత్తం 26,634 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయించారని సాక్షి దినపత్రిక రాసింది. సాక్షి దినపత్రిక ఇచ్చిన జాబితా ప్రకారం ఇంకా ఆ వివరాలు ఇలా ఉన్నాయి -
కేటలిస్టు సాఫ్ట్‌వేర్‌కు 50 ఎకరాలు, దాని విలువ రూ.968 కోట్లు
ఇన్ఫోసిస్‌కు 50 ఎకరాలు, దాని విలువ రూ. 968 కోట్లు
మైక్రోసాఫ్ట్‌కు 42 ఎకరాలు, దాని విలువ రూ. 813 కోట్లు
విప్రోకు 30 ఎకరాలు, దాని విలువ రూ.580 కోట్లు
కంప్యూటర్ అసోసియేట్స్‌కు 30 ఎకరాలు, దాని విలువు రూ. 580 కోట్లు
హైటెక్ సిటీకి 80 ఎకరాలు, దాని విలువ రూ. 1,548 కోట్లు
ఐవీఆర్‌సీఎల్‌కు 50 ఎకరాలు, దాని విలువ రూ. 968 కోట్లు
ఐటీ పార్క్, మణికొండకు 49 ఎకరాలు, దాని విలువ రూ. 948 కోట్లు
మహేశ్వరం, హార్డ్‌వేర్ పార్క్‌కు 18 ఎకరాలు, దాని విలువ రూ. 348 కోట్లు
మాదాపూర్, ఐటీ పార్క్‌కు 9 ఎకరాలు, దాని విలువ రూ. 174 కోట్లు
ఐఎంజీ భారత్‌కు 850 ఎకరాలు, దాని విలువ రూ. 16,458 కోట్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 5,500 ఎకరాలు, దాని విలువ రూ. 79,860 కోట్లు
గంగవరం పోర్టుకు 1,800 ఎకరాలు, దాని విలువ రూ. 8,712 కోట్లు
కాకినాడ పోర్టుకు 354 ఎకరాలు, దాని విలువు రూ. 1,713 కోట్లు
కృష్ణపట్నం పోర్టుకు 2,000 ఎకరాలు, దాని విలువ రూ. 9,680 కోట్లు
మలేసియా టౌన్‌షిప్‌కు 35 ఎకరాలు, దాని విలువ రూ. 508 కోట్లు
సింగపూర్ టౌన్‌షిప్‌కు 80 ఎకరాలు, దాని విలువ రూ. 193 కోట్లు
ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు 535 ఎకరాలు, దాని విలువ రూ. 10,357 కోట్లు
డాబర్‌కు 1,000 ఎకరాలు, దాని విలువ రూ.100 కోట్లు
ఓరియంట్ సిమెంట్స్‌కు 820 ఎకరాలు, దాని విలువు రూ. 8 కోట్లు
బీచ్‌శాండ్-ట్రైమెక్స్‌కు 1,700 ఎకరాలు, దాని విలువ రూ. 10,000 కోట్లు
పోలేపల్లి సెజ్‌కు 1,200 ఎకరాలు, దాని విలువ రూ. 120 కోట్లు
కాకినాడ్ సెజ్‌కు 8,000 ఎకరాలు, దాని విలువ రూ. 400 కోట్లు