మెరుగుపడిన సత్యసాయి ఆరోగ్యం: చికిత్సకు స్పందిస్తున్న బాబా

బాబా కిడ్నీలు, కాలేయం, గుండెల పనితీరు బాగా మెరుగు పడిందని పేర్కొన్నారు. అయితే బాబాకు ఇంకా అవసరమైనందున వెంటిలేటర్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. బాబాకు ఆరోగ్యం కాస్త మెరుగు పడినందున ఈ రోజు నుండి డాక్టర్లు ద్రవాహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా బాబా ఆరోగ్యంపై ఉత్కంఠ తగ్గడంతో పుట్టపర్తిలో ఇప్పటి వరకు పెట్టిన కొన్ని ఆంక్షలను తొలగించారు. పోలీసులంతా అక్కడ ఉన్నప్పటికీ ఆంక్షలు మాత్రం కాస్త తగ్గించారు. కాగా ఇన్నాళ్లు మూసి వేసి ఉన్న దుకాణాలు ఈ రోజు కొన్ని తెరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications