వైయస్ జగన్‌కు వెంకయ్య నాయుడు షాక్, ముస్లిం రిజర్వేషన్లకు నో

గురువారం విలేకరుల సమావేశంలో వెంకయ్యనాయుడు తమ పార్టీ మత ప్రాతిపదికన రిజర్వేషన్‌లకు వ్యతిరేకమని చెప్పారు. దేశంలో అన్ని మతాలను సమానంగా చూస్తామని, ఏ ఒక్క మతానికో ప్రాధాన్యత కల్పించే పరిస్థితికి తమ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మతాలను బట్టి రిజర్వేషన్లు కల్పించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విదేశాలలో నుండి మత సంస్థలకు వచ్చే ఆదాయంపై దృష్టి సారిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం కూడా తీసుకు వస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications