వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై వైయస్ జగన్ బూచీ, సోనియాకు ముందస్తు హెచ్చరికలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు పూర్తి కావస్తుండడంతో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి పెంచే పనికి తెలంగాణవాదులు పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వారు ఓ కొత్త వాదనను ముందుకు తెస్తున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బూచీని చూపిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోకపోతే వైయస్ జగన్ తెలంగాణలో బలపడుతారని, దానివల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం కలిగిస్తుందని వారంటున్నారు.

ఇంతకు ముందు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండ రామ్ ఆ వాదనను ముందుకు తెస్తే, బుధవారం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుడు టి. జీవన్ రెడ్డి అటువంటి వాదననే ముందుకు తెచ్చారు. కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే, తెలంగాణలో కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్ వైపు వెళ్తారని కోదండరామ్ చెప్పారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో వైయస్ జగన్ బలం పుంజుకుంటారని జీవన్ రెడ్డి అన్నారు. ఇటువంటి వాదనలు ఇక ముందు మరింతగా పుంజుకునే అవకాశం ఉంది.

తెలంగాణపై ఇప్పటి వరకు వైయస్ జగన్ తన వైఖరిని ప్రకటించలేదు. జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని కొండా సురేఖ వంటి జగన్ వర్గం తెలంగాణ నాయకులు చెబుతూ వస్తున్నారు. తాము తెలంగాణ కోసం పోరాడుతామని కూడా చెబుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆలోచన మరో విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికల వరకు కూడా కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై ప్రకటన చేయకపోతే, లేదంటే తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే వైయస్ జగన్‌తో అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీమాంధ్రలో ఆధిక్యత సాధిస్తే, తాము తెలంగాణలో ఆధిక్యత సాధిస్తామని, తద్వారా జగన్‌తో కలిసి తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

English summary
AS five states assembly polls are nearing complete, Telangana leaders are increasing pressure on Congress president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X