వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐపై భారత్ ప్రకటనలు సరికావన్న పాక్: భారత్‌ను కవ్వించే ఉద్దేశ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pakistan
న్యూఢిల్లీ: భారత దేశాన్ని కవ్వించేందుకు పాకిస్తాన్ మరోసారి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను వారి దేశంలోనే అమెరికా మట్టు పెట్టిన నేపథ్యంలో భారత్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ తప్పు పడుతోంది. ఐఎస్ఐకి అలై ఖైదాతో సంబంధాలు ఉండ వచ్చునని, అంతర్జాతీయ నెంబర్ టూ తీవ్రవాది దావూద్ ఇబ్రహీం కూడా పాకిస్తాన్‌లో ఉన్నాడని వారిని అప్పగించాలని భారత్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి బషీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐఎస్ఐపై భారత్ విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఐఎస్ఐతో అలై ఖైదాకు ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. పాక్ తన అస్తిత్వాన్నికాపాడుకుంటుందని చెప్పారు.

పాక్ రక్షణ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు వద్దని చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను కనుగొనడంలో పాక్ వైఫల్యం లేదన్నారు. అది గ్లోబల్ ఫెయిల్యూర్ అని చెప్పారు. లాడెన్ మరణం తర్వాత అమెరికాతో సంబంధాలు దెబ్బ తినలేదన్నారు. పాక్‌, అమెరికా సంబంధాలు చాలా ముఖ్యమని చెప్పారు. అయితే ఆపరేషన్‌లో మాత్రం తమ పాత్ర లేదన్నారు. పాక్ తన సార్వభౌమత్యాన్ని తప్పకుండా కాపాడుకుంటుందన్నారు.

English summary
It seems, Pakistan is trying to provocate India. Pak foreign secretary Basheer accused Bharath comment on ISI links with Al Queda. He confirmed that America and Pak relations will continue softly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X