విజయవాడ: కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే అనుచరులు ఓ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ కాంగ్రెసు శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ అనుచరులుగా భావించబడుతున్న యలమంచిలి జయ, అయన అనుచరులు పలువురు సతీష్ అనే వ్యక్తిపై గురునానక్ కాలనీ పరిసర ప్రాంతంలో రాళ్లదాడి చేశారు. సతీష్ తలకు గాయాలయ్యాయి.
దేవినేని అనుచర వర్గం దాడిలో సతీష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. యలమంచిలి జయతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.