చంద్రబాబు మహానాడుకు తెలంగాణ సెగ, జై తెలంగాణ నినాదాలతో గొడవ

అప్రమత్తమైన పోలీసులు తెలంగాణవాదులను చెదరగొట్టారు. మహానాడుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్నవారిని గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే తెలంగాణ విద్యార్థులు మహానాడు ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మహానాడును అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు చంద్రశేఖర్ గురువారం ప్రకటించారు. ఒయు జెఎసి కూడా మహానాడును అడ్డుకుంటామని చెప్పారు. మహానాడును అడ్డుకుని తీరుతామని ప్రకటించిన విద్యార్థులు మళ్లీ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.