సత్య సాయి ట్రస్టుపై హైకోర్టుకు వెళ్తా: మాజీ మంత్రి నాగిరెడ్డి హెచ్చరిక

Sathya Sai Baba
అనంతపురం: శ్రీ సత్య సాయి ట్రస్టుపై తాను హైకోర్టుకు వెళ్తానని మాజీ మంత్రి నాగిరెడ్డి హెచ్చరించారు. ప్రశాంతి నిలయంలోని యజర్మందిరాన్ని అధికారుల సమక్షంలోనే తెరవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. యజుర్ మందిరంలోని కానుకలను గోప్యంగా ఉంచరాదని ఆయన అన్నారు. యజర్ మందిరంలో ఏయే కానుకలున్నాయో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రశాంతి నిలయానికి సంబంధించి వివరాలు అందించాలని తాను సమాచార హక్కు చట్టం కింద విజ్ఞప్తి చేశానని, ఇప్పటి వరకు సమాధానం రాలేదని, 30 రోజుల్లోగా సమాధానం రాకపోతే హైకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు. సత్య సాయిబాబా నివాసం ఉన్న యజర్ మందిరాన్ని తెరవడానికి ట్రస్టు సభ్యులు ఉద్యుక్తులవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సత్య సాయి ట్రస్టు ఆస్తుల వివరాలన్నీ ఇందులోనే ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+