ఏఐఈఈఈలో ఆంధ్రా విద్యార్థుల హవా: అన్ని విభాగాల్లో ముందంజ
State
oi-Srinivas G
By Srinivas
న్యూఢిల్లీ: ఏఐఈఈఈ ఫలితాలలో రాష్ట్ర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. రాష్ట్రానికి 2, 4, 5, 7, 8, 12 ర్యాంకులు వచ్చాయి. మన రాష్ట్రం నుండి 1.10 లక్షల మంది ఏఐఈఈఈ పరీక్షలు రాశారు. దేశవ్యాప్తంగా 12.46 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఓపెన్ విభాగంలో రెండవ ర్యాంకును రాష్ట్రానికి చెందిన కునాల్ చావ్లా పొందారు. 4వ ర్యాంకును వంశీధర్, 5వ ర్యాంకును వరుణ్, 7వ ర్యాంకును పృథ్వీతేజ్, 8వ ర్యాంకును భార్గవ్, 12వ ర్యాంకును సాయి సురేంద్రరెడ్డి పొందారు.
బిఆర్క్ విభాగంలో, ఎస్సీ విభాగంలో రాష్ట్రానికి 1 మరియు 2 ర్యాంకులు వచ్చాయి. ఎస్టీ విభాగంలో కూడా రామకృష్ణ అనే విద్యార్థి మొదటి ర్యాంకును పొందారు.