నాకు వ్యక్తిగత అభిప్రాయాలు లేవు: పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
హైదరాబాద్: తనకు వ్యక్తిగత అభిప్రాయ బేధాలు లేవని ఓ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయాలే తన అభిప్రాయాలు అవుతాయని వ్యక్తిగత అభిప్రాయాలు అంటూ ఉండవని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలు ఎలా ఉంటే అలాగే వెళతానని అన్నారు. ఈ నెల 11వ తేదిన గాంధీ భవన్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని ఆయన చెప్పారు. తన ముందు ఓ లక్ష్యం విధించుకొని ముందుకు వెళతానని ఆయన అన్నారు. తన మంత్రి పదవిపై అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటే అలా చేస్తానని చెప్పారు.

పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యం అన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అందరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం కలిగిస్తూ పని చేస్తానని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తనపై చేసిన వ్యాఖ్యలపై బొత్స మాట్లాడారు. విహెచ్‌ను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+