చంద్రబాబుకు ఇసి షాక్, కార్యవర్గం వివరాల కోసం నోటీసు

తనకు కొత్తగా తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదని అంటున్నారు. మహానాడులో కూడా పార్టీ కొత్త కార్యవర్గం కూర్పు ఊసే లేదని తెలుస్తోంది. కొత్త కార్యవర్గం ఏర్పాటులో తన బావ మరిది నందమూరి హరికృష్ణ చేయి పెడితే సమస్య మరింత తీవ్రం కావచ్చునని చంద్రబాబు భయపడినట్లు ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. హరికృష్ణ గత కొద్ది కాలంగా చంద్రబాబుతో విభేదిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో కూడా కార్యవర్గం కూర్పు చంద్రబాబుకు సమస్యగా తయారైందని అంటున్నారు. ఇసి నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నూతన కార్యవర్గం కూర్పుపై మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇసి నుంచి తమకు నోటీసు ఏదీ రాలేదని తెలుగుదేశం కార్యాలయ కార్యదర్శి జనార్దన్ చెబుతూనే కార్యవర్గం వివరాలను అడిగిన మాట వాస్తవమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications