కోదండరామ్ తెరాసలో చేరుతారా?, కెసిఆర్‌కు జెఎసి షాక్

కోదండరాం టీఆర్ఎస్‌లోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదనే అభిప్రాయంతో జేఏసీలోని కొన్ని సంఘాలున్నాయి. అలాచేస్తే తెలంగాణ కోసం టీడీపీ నుంచి సస్పెండైన నాగం జనార్దన్‌రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్‌గా చేసుకుంటామని చెబుతున్నాయి. మిలియన్‌మార్చ్ వల్ల కేసీఆర్‌తో ఏర్పడిన అంతరాన్ని తగ్గించుకోడానికి కోదండరాం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
అదే సమయంలో కెసిఆర్‌కు తెలంగాణ జేఏసీ భాగస్వామ్య పక్షాలు షాక్ ఇచ్చాయి. ఆయన ప్రకటించినట్లుగా మంగళవారం సమావేశం కాబోమని మొండికేశాయి. దీంతో జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడక తప్పలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జేఏసీ చైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈనెల 9న జేఏసీ భేటీ జరపాలని నిర్ణయించారు.
దానికిముందు అనేక హైడ్రామా చోటు చేసుకుంది. తొలుత 6న భేటీ కావాలని జేఏసీ నిర్ణయించగా, నాలుగో తేదీన టీఆర్ఎస్ అనుకూల సంఘాల ప్రతినిధులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం జరిపారు. అందులో కోదండరాం పాల్గొన్నారు. తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ 7న జేఏసీ భేటీ ఉంటుందని ప్రకటించారు. దీనిపై ఆ సమావేశంలో పాల్గొనని జేఏసీ భాగస్వామ్య పక్షాలు గుర్రుమన్నాయి. జేఏసీ భేటీకి ముందు టీఆర్ఎస్ సమావేశం పెట్టటం ఏమిటని ప్రశ్నించటమేకాక, కేసీఆర్ సొంత పత్రిక కోసం ఏడోతేదీకి వాయిదా వేసిన జేఏసీ సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications