సహాయ నిరాకరణ నుంచి సార్వత్రిక సమ్మె దాకా

తెలంగాణ వచ్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల జెఎసి నాయకుడు స్వామిగౌడ్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణలో 2.5 లక్షల మంది స్థానికేతర ఉద్యోగులున్నారని ఆయన చెప్పారు. ఉద్యమంలోకి తెలంగాణ పోలీసులు కూడా రావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే హక్కు ఉద్యోగులకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై చర్చలపై తమకు నమ్మకం పోయిందని ఆయన అన్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమిస్తామని ఆయన అన్నారు. జీతాల కోసం తమ ఉద్యోగులు ఎవరూ ఉద్యమాన్ని విరమించాలని గతంలో కోరలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications