అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

Jayaram
హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన జయరామ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో మరణించాడు. అమెరికాలోని టెన్నెసీ స్టేట్‌లో జరిగిన నీటి ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వాటర్‌ఫాల్స్‌లో పడిన స్నేహితురాలిని కాపాడబోయి ఈత రాక అతను మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెం దిన పానంగిపల్లి కృష్ణమూర్తి కుటుంబం వనస్థలిపురం మెడికల్ అండ్ హెల్త్ కాలనీ లో స్థిరపడింది. కృష్ణమూర్తి రాజస్థాన్ కోట ప్రాంతంలో టాటా ప్రాజెక్ట్‌లో మేనేజర్. భార్య, కూతురు మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో ఉంటుండగా కుమారుడు జయరామ్ (27) అమెరికాలోని టెన్నెసీ స్టేట్ నాష్‌విల్లీ సిటీలో సినోప్సిక్ టెక్నో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.

ఆదివారం వారాంతపు సెలవు కావడంతో మరో నలుగురు తోటి ఉద్యోగులతో కలిసి జయరామ్ బర్గెస్ వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్లారు. అక్కడ తోటి ఉద్యోగిని ఒకరు నీటిలో పడిపోవడంతో ఆమెను కాపాడే ప్రయత్నించి ఈత రాక జయరామ్, మరో స్నేహితుడు ఇద్దరు నీట మునిగి చనిపోయారు. నీటిలో పడిన ఉద్యోగిని మాత్రం స్థానికుల సహకారంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం.

పదవ తరగతి వరకు అమలాపురంలో చదువుకున్న జయరామ్ దిల్‌సుఖ్‌నగర్ చైతన్య కళాశాలలో ఇంటర్, నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని హెచ్‌ఆర్‌డీ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ పూర్తి చేశాడు. అనంతరం అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసి అక్కడే పనిచేస్తున్నాడు. అతని మరణంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+