జగన్ అంతానికి వైయస్ జగనే బాధ్యుడు: డిఎల్

జగన్ అక్రమాలు వైయస్ రాజశేఖర రెడ్డికి తెలియవని, వైయస్సార్ అధికారాన్ని జగన్ అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. కాంగ్రెసు వల్లనే జగన్ ప్రయోజనం పొందారని ఆయన అన్నారు. తాను నిర్దోషినని చెప్పుకోవడానికి తన సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో జగన్ ఎందుకు వివరించడం లేదని ఆయన అడిగారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పార్టీ విషయాలు మాత్రమే వైయస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు.
రాజీనామాలు చేస్తామని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు చెప్తారని, కానీ రాజీనామాలు చేయరని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేసి జగన్ వర్గం ఎమ్మెల్యేలు గెలవాలని ఆయన అన్నారు. జగన్‌కు మద్దతు పలుకుతున్న పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యవహారం కూడా త్వరలో బయటకు వస్తుందని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో తాను రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు పేరు ఎప్పుడూ చెప్పలేదని, అదృశ్య శక్తులున్నాయని మాత్రమే అన్నానని, సిబిఐ దర్యాప్తులో అన్నీ బయటకు వస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications