కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇరుకున పడిందా?

కాంగ్రెసుకు ప్రస్తుతం ఉన్న 155 మంది శాసనసభ్యుల్లో 26 మంది రాజీనామాలు చేయడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదు. పైగా, ప్రజారాజ్యం పార్టీకి చెందిన 17 మంది శాసనసభ్యులు మద్దతు పలకబోతున్నారు. మజ్లీస్‌కు చెందిన ఏడుగురు కూడా మద్దతిస్తారు. కాగా, తెలుగుదేశం పార్టీకి ఉన్న 90 మంది శాసనసభ్యుల్లో ఇద్దరు జగన్ వైపు వెళ్లడంతో ఆ బలం 88కి తగ్గింది. పైగా, తెలంగాణ అంశంపై నలుగురు శాసనసభ్యులు రాజీనామాలు సమర్పించారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ బలం అంతంగా లేకపోవడంతో శాసనసభలో కాంగ్రెసుకు వచ్చే డోకా ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన 11 మంది శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేశారు.
నెంబర్ గేమ్‌లో ప్రస్తుత పరిస్థితిలో కిరణ్ ప్రభుత్వానికి వచ్చే డోకా ఏమీ లేదు. ఒకవేళ తెలంగాణ అంశంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే సంక్షోభం తలెత్తుతుంది. అయితే, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు శాసనసభ్యులు అందుకు సిద్ధంగా లేరు. ఏ రకంగా చూసినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే, రాజకీయంగా సంక్షోభ పరిస్థితి మాత్రం కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications