ఆ ప్రకటన తర్వాత రోశయ్య, బాబు ఫిక్స్: జీవన్ రెడ్డి

రోశయ్య వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను కించ పర్చేలా ఉన్నాయన్నారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాలకు చంద్రబాబు, రోశయ్యే కారణం అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల రాజీనామాలకు వారే కారణం అన్నారు. అధిష్టానం తెలంగాణ ఇచ్చినా దానిని రోశయ్య అడ్డుకున్నారన్నారు. కాంగ్రెసులో క్రమశిక్షణ లేని వ్యక్తి రోశయ్యే అన్నారు. రోశయ్య వైఖరి కారణంగా తెలంగాణలో కాంగ్రెసుపై వ్యతిరేకత పెరిగిందన్నారు.
అధిష్టానం చెప్పినా రోశయ్య అసెంబ్లీలో తీర్మానం ఎందుకు ప్రవేశ పెట్టలేదన్నారు. అమీర్ పేట భూకుంభకోణంపై కౌంటర్ వేసిన ప్రభుత్వం దివంగత వైయస్ పేరు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడంపై ఎందుకు వేయలేదన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ తప్పకుండా వస్తుందన్నారు. సెప్టెంబర్ 17 లోగా తెలంగాణ ప్రక్రియ ప్రారంభించకుంటే వారంతా రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications