నెల్లూరు: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేష్టలు చూసి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తట్టుకోలేక పోయే వారని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ద్వారా హస్తం గుర్తుపై గెలిచిన వారు ఇప్పుడు అదే కాంగ్రెసు పార్టీని విమర్శఇంచడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
రాజీనామాల వల్ల కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయే ఘన విజయం సాధిస్తుందని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.