జానాతో సమావేశం: తెలంగాణ నేతలపై బాబు గుర్రు

బాబు ఆగ్రహంతో తగ్గిన తమ్ముళ్లు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. అయితే తాము లేఖ మాత్రమే కాకుండా జానారెడ్డిని కలవడానికి కూడా అధినేత నుండి అనుమతి తీసుకున్నామని వారు బయటకు చెబుతున్నారట. మంగళవారం ఉదయం ఎర్రబెల్లి, మోత్కుపల్లి ఆధ్వర్యంలో పలువురు టిటిడిపి నేతలు జానారెడ్డిని కలిసి తెలంగాణ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. కాగా గతంలోనూ చంద్రబాబునాయుడు పలుమార్లు టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications